Ktr tweet on PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మరోసారి తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని.. విషప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి కేటీఆర్ ఆక్షేపించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం కాదని.. అటెన్షన్ డైవర్షన్ ప్రభుత్వమని ఆరోపించారు. దేశంలో అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర జరుగుతోందని అన్నారు. పెరుగుతున్న పెట్రో ధరలు, భారమవుతున్న నిత్యవసరాలు, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్రకు పాల్పడుతున్నారని ట్విట్టర్లో మండిపడ్డారు.
విషప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేంద్రంపై కేటీఆర్ ఫైర్ - కేంద్రంపై కేటీఆర్ ఫైర్
Ktr tweet on PM Modi తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని, విషప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేటీఆర్ ఆక్షేపించారు.
కుట్రలను కనిపెట్టకపోతే దేశానికి, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం కోసం.. ధర్మం కోసం... అనేది భాజపా అందమైన నినాదం మాత్రమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు. విద్వేషం కోసం.. అధర్మం కోసం.. అనేది అసలు రాజకీయ విధానమని పేర్కొన్నారు. హర్ ఘర్ జల్ అన్నారు... కానీ, హర్ ఘర్ జహర్ హర్ దిల్ మే జహర్ అంటూ విషాన్ని నింపే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా ద్వారా దేశంలోని సోషల్ ఫ్యాబ్రిక్‌ను దెబ్బతీసే కుతంత్రం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ద్వేషం కాదు.. దేశం ముఖ్యమని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం ముఖ్యమని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇవీ చదవండి: