బాలీవుడ్ బిగ్‌బీ వ్యాఖ్యాతగా ప్రసారమవుతోన్న కౌన్‌బనేగా కరోడ్‌పతి- 13 వ సీజన్ ఆగస్టు 23న ప్రారంభమై.. ఎంతో ప్రేక్షకాదరణ పొందింది. ఇప్పటికే 12 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ గేమ్‌షో.. ఎంతో హిట్టయిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్లో శుక్రవారం(సెప్టెంబర్-03న) రోజున.. పార్టిసిపెంట్స్‌గా ఒకప్పటి లెజండరీ క్రికెటర్లు గంగూలీ, సెహ్వాగ్ పాల్గొన్నారు. అయితే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో... వీక్షకుల్లో ఆసక్తి రేకెత్తించగా.. కేబీసీ ఫ్యాన్స్ మిస్సవకుండా ప్రోగ్రాం చూశారు. బిగ్‌బీని హాట్ సీట్లో కూర్చోబెట్టి.. దాదా వ్యాఖ్యాతగా వ్యవహరించటం నవ్వులు పూయించింది.
కేబీసీలో కేటీఆర్ ట్వీట్...
ఇదంతా ఒకెత్తయితే... ఇదే ఎపిసోడ్లో అనూహ్యంగా ఓ ప్రశ్న అందరి దృష్టిని ఆకర్షించింది. ఎంతో సరదాగా.. ఆసక్తికరంగా సాగుతున్న ఆటలో.. కంప్యూటర్ స్క్రీన్‌పై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు సంబంధించిన ప్రశ్న దర్శనమిచ్చింది. కరోనా సమయంలో వస్తున్న మందుల విచిత్ర పేర్ల విషయంలో మంత్రి కేటీఆర్.. అప్పట్లో చేసిన ట్వీట్‌కు సంబంధించిందే ఆ ప్రశ్న. మంత్రి కేటీఆర్.. కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు మధ్య జరిగిన సరదా సంభాషణను గుర్తుచేసింది.
ఆ రోజు సరదాగా చేసిన ట్వీట్..
కరోనా వైద్యంలో భాగంగా వాడుతున్న మందులు, మాత్రల పేర్లను తన ట్విట్టర్ వేదికగా మే 20, 2021న ప్రస్తావించిన కేటీఆర్.. పలికేందుకు కష్టంగా ఉన్న పేర్లు ఎందుకు పెట్టారో ఎవరికైనా తెలుసా? అని సరదాగా ప్రశ్నించారు.