తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమితో ఒరిగేదేమీ లేదని మంత్రి కేటీఆర్(minister ktr) అన్నారు. గత 20 ఏళ్లలో తెరాస ఎన్నో ఆటుపోట్లను చవిచూసిందని మంత్రి పేర్కొన్నారు. స్ఫూర్తిదాయకంగా పోరాడిన తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఆయన అభినందనలు తెలిపారు. భవిష్యత్తు పోరాటాలకు కార్యకర్తలు సన్నద్ధంగా ఉండాలని మంత్రి ట్వీట్ చేశారు.
ఈ ఎన్నికకు ప్రాధాన్యం లేదు
ఈ ఉప ఎన్నికకు అంతగా ప్రాధాన్యం లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హుజూరాబాద్ ఎన్నిక కోసం శ్రమించిన మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రచారంలో మంత్రులు హరీశ్ రావు, కొప్పుల, గంగుల బాగా శ్రమించారని కొనియాడారు. పార్టీ తరఫున కృషి చేసిన ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు, తెరాస సామాజిక మాధ్యమ యోధులను మంత్రి కేటీఆర్ అభినందించారు.
ఇదీ చూడండి:ETELA WON: హుజురాబాద్‌లో ఈటల ఘన విజయం.. 24 వేల 68 ఓట్ల మెజార్టీతో గెలుపుబావుటా..