తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిన హరితహారం కార్యక్రమంతో తెలంగాణలో గ్రీన్ మిషన్ కొనసాగుతోందని మంత్రి కేటీఆర్(minister ktr) అన్నారు. హైదరాబాద్ మున్సిపాలిటీ హారితహారంలో భాగంగా 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు, దాని 19 ఇంటర్ చేంజ్‌లను పచ్చనితోరణంగా మార్చిన దృశ్యాలను కేటీఆర్ ట్విట్టర్(twitter) వేదికగా పంచుకున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా, మధ్యలో నాటిన మొక్కలు చిగురులు తొడిగి పచ్చగా కనువిందు చేస్తున్నాయి. ఔటర్ రోడ్డును వాహనాలు ఎక్కే దిగే కూడళ్ల మధ్య వివిధ ఆకారాల్లో మొక్కలు ఆకర్షిస్తున్నాయి.