తెలంగాణ మంత్రి కేటీఆర్ మొక్కను నాటారు. తన తండ్రి.. ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కోటి వృక్షార్చనలో సతీమణి, కుమార్తెతో కలిసి కేటీఆర్ భాగస్వామ్యం పంచుకున్నారు.
హైదరాబాద్లోని ప్రగతిభవన్లో సతీమణి శైలిమ, కూతురు అలేఖ్యతో కలిసి మొక్కలు నాటారు. తనకు జన్మనిచ్చి... నిత్యం స్ఫూర్తిని అందిస్తున్న కేసీఆర్... ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కేటీఆర్ ఆకాంక్షించారు.