తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని... మర్రి చెన్నారెడ్డి మానవవనరుల సంస్థలో టీఎస్‌బీపాస్ వెబ్‌సైట్‌ను మంత్రి కేటీఆర్ అధికారికంగా ప్రారంభించారు. నేటి నుంచి అమలులోకి రానున్న ఈ వెబ్సైట్లో పట్టణాల్లో భవన నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులను పొందవచ్చు. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ భాష్లల్లో వెబ్సైట్ అందుబాటులో ఉండనుంది.
దరఖాస్తుదారు స్వీయధ్రువీకరణతో భవన నిర్మాణ అనుమతికి జారీ ఇవ్వనున్నారు. నిర్దేశించిన గడువులోగా టీఎస్‌బీపాస్ ద్వారా అనుమతులు, ధ్రువపత్రాల జారీ చేయనున్నారు. భవన నిర్మాణాలు, లే అవుట్లకు అనుమతులు సరళంగా, నిర్ధేశిత గడువులోగా వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ బీ-పాస్ చట్టాన్ని తీసుకొచ్చింది. కార్యాలయాల చుట్టూ తిరగకుండా స్వీయ ధ్రువీకరణ ద్వారా నిర్దేశించిన గడువులోగా అనుమతులు పొందడమే దీని ప్రధాన ఉద్దేశం.