ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

దుబ్బాకలో గెలిచేందుకు భాజపా కుట్ర: కేటీఆర్ - మంత్రి కేటీఆర్ తాజావార్తలు

సోమవారం భాగ్యనగరంలో భాజపా భారీ స్థాయిలో కుట్రకు పథకం రచించిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ కుట్రలకు తెరలేపినట్లు వెల్లడించారు. మొదట డబ్బుల ప్రయోగం చేసి ఫెయిల్ అయ్యారని, ఈ రోజు కూడా కోటి రూపాయలు దొరికాయని కేటీఆర్ తెలిపారు.

minister-ktr-fires-on-bjp-over-dubbaka-elections
minister-ktr-fires-on-bjp-over-dubbaka-elections

By

Published : Nov 1, 2020, 7:10 PM IST

తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా కుతంత్రాలు చేస్తోందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ఓట్లు కొనుగోలు చేసేందుకు సిద్ధం చేసిన డబ్బు భారీ ఎత్తున పట్టుబడ్డాయని కేటీఆర్ తెలిపారు. రేపు ప్రగతిభవన్, డీజీపీ కార్యాలయాలు ముట్టడించి ఆందోళన చేసే అవకాశం ఉందన్నారు.

దుబ్బాకలో గెలిచేందుకు భాజపా కుట్ర: కేటీఆర్

హైదరాబాద్ నగరంలో పోలీసు ఫైరింగ్ జరిగే విధంగా అందోళన చేయాలని భాజపా ప్రణాళిక చేసిందని ఆరోపించారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా కుట్రలు చేస్తోందని ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి తెరాస తరపున ఫిర్యాదు చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details