తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పట్టభద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు వేశారు.
హైదరాబాద్‌లోని షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పట్టభద్రులంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. సమస్యలను పరిష్కరించే అభ్యర్థికే తన ఓటు వేశానని కేటీఆర్ స్పష్టం చేశారు. విద్యావంతులంతా సమర్థులకే ఓటు వేయాలని కోరారు.
మహబూబ్‌నగర్‌లో రాష్ట్ర పర్యటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. విద్యావంతులు ఓటింగ్‌కు దూరంగా ఉంటారనే అపోహను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.