దేశంలో ట్విటర్‌ను నిషేధిస్తే తాను వెంటనే సామాజిక మాధ్యమాల నుంచి వైదొలుగుతానని తెలంగాణ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ట్విటర్‌ను నిషేధిస్తే మీరు ఏ సామాజిక మాధ్యమాన్ని ఎంచుకుంటారని బుధవారం ఒక నెటిజన్ కేటీఆర్‌ను ప్రశ్నించగా ట్విటర్‌లో ఆయన ఈ సమాధానం తెలిపారు.
హనీవెల్‌కు కృతజ్ఞతలు
తెలంగాణకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, ఎన్95, మాస్క్‌లు, పీపీఈ కిట్లను విరాళంగా ఇచ్చిన హనీవెల్ సంస్థకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక కార్పొరేటు బాధ్యత కింద సంస్థ ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు.