ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"దేవాలయ భూములపై అధికారం ప్రభుత్వానిదే.. అప్పీలుకు వెళ్తాం' - దేవాదాయ భూములపై హక్కు ప్రభుత్వానిదే అన్న మంత్రి కొట్టు సత్యనారాయణ

రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణను అర్చకులకు అప్పగించడానికి సిద్ధమని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. కానీ ఈ ఆలయాల పరిధిలో ఉన్న భూములపై ప్రభుత్వానికే అధికారం ఉంటుదని దీనిపై అప్పీలుకు వెళ్తామన్నారు.

Minister Kottu Satyanarayana
మంత్రి కొట్టు సత్యనారాయణ

By

Published : Jun 1, 2022, 8:38 AM IST

హైకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో 5 లక్షల లోపు ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణను అక్కడి అర్చకులకు అప్పగించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉపముఖ్యమంత్రి, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఈ ఆలయాల పరిధిలో 2 లక్షల ఎకరాల వరకు ఉన్నాయని చెప్పారు. వాటిపై అధికారం ప్రభుత్వానిదేనని... కౌలు వేలం నిర్వహణ దేవాదాయశాఖ పరిధిలో ఉంటుందని వ్యాఖ్యనించారు. అయితే దీనిపై స్పష్టత తీసుకోవాల్సి ఉందన్నారు. అవసరమైతే న్యాయస్థానంలో అప్పీలుకు వెళ్తామని స్పష్టం చేశారు.

దేవాలయాల్లో బ్రాహ్మణేతరుల్ని అర్చకులుగా నియమించే విషయమై అధికారులు, పండితులతో చర్చించాల్సి ఉందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆలయాల్లో అవినీతిపై నిఘా ఉంచేందుకు డీఐజీ స్థాయి అధికారి సారథ్యంలో విజిలెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేస్తామన్నారు. సీజీఎఫ్‌ కింద 2016-17లో మంజూరై.. ఇప్పటికీ ప్రారంభంకాని పనుల్ని రద్దు చేయాలని నిర్ణయించామన్నారు. ఏడు పెద్ద దేవస్థానాలతో పాటు తర్వాత విభాగంలోకి వచ్చే 31 ఆలయాల్లోనూ మాస్టర్‌ప్లాన్‌ రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details