రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్ ధ్యేయమని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లాలోని ముదినేపల్లి మండలంలో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా, రైతాంగం అభ్యున్నతే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. అనంతరం మంత్రి నాని చేతుల మీదుగా రైతులకు విత్తనాలు పంపిణీ చేశారు. అంతకుముందు వ్యవసాయ, పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు.
Minister kodali Nani: రైతు సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం: మంత్రి కొడాలి నాని - RYTHU CHAITANYA YATRA
వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన ఉందన్నారు మంత్రి కొడాలి నాని. రైతు అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని చెప్పారు.
Minister kodali Nani