ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పింఛన్ల తొలగింపుపై ప్రతిపక్షాలవి అసత్య ప్రచారాలు' - Kodali Nani comments On Pentions distributions news

పింఛన్లు తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని... మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హత ఉన్న లబ్ధిదారులెవ్వరి పింఛన్లు తొలగించలేదని మంత్రి స్పష్టం చేశారు.

minister-kodali-nani-on-pentions-distributions
minister-kodali-nani-on-pentions-distributions

By

Published : Feb 2, 2020, 5:16 PM IST

మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని

అర్హత ఉన్న లబ్ధిదారులెవ్వరి పింఛన్లు తొలగించలేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. పింఛన్లు తొలగించారంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 39లక్షల మందికి పింఛన్లు ఉండేవని... జగన్ సీఎం అయ్యాక 54లక్షల మందికిపైగా ఇస్తున్నట్లు తెలిపారు. 15లక్షల మందికి అదనంగా పింఛన్లు అందిస్తున్నామని వివరించారు. ఇంటింటికీ పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అమలు చేస్తోందన్నారు. అమ్మఒడి, రైతుభరోసా తదితర సంక్షేమ పథకాల ద్వారా కోటి మందిపైగా లబ్ధిపొందుతున్నారని వివరించారు.

పవన్... పోరాటం చేయండి..

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి నిధులు కేటాయించకపోవడంపై తెలుగుదేశం పార్టీ నాయకులు వైకాపాను నిందిస్తున్నారని... కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన, భాజపాతో పొత్తు పెట్టుకున్నందున నిధుల విషయంలో పవన్‌కల్యాణ్‌ పోరాటం చేయాలని మంత్రి సూచించారు. జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు జేసీ దివాకర్ రెడ్డికి లేదని... ఆయన ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : కేంద్ర బడ్జెట్​... రాష్ట్రానికి నిరాశాజనకంగా ఉంది: మంత్రి కన్నబాబు

ABOUT THE AUTHOR

...view details