తెదేపా అధినేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. కేసులు ఎదుర్కోలేక దేశంలోనే ఎక్కువ స్టేలు తెచుకున్న వ్యక్తి... చంద్రబాబు అని విమర్శించారు. వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు.
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన శిక్ష వేశారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైకాపాకు 4 లక్షలకు పైగా మెజార్టీ వస్తోందని జోస్యం చెప్పారు. విశాఖ ఉక్కు ఉద్యమంపై దమ్ముంటే తెదేపా నేతలు దిల్లీలో నిరసన తెలిపాలని సవాల్ విసిరారు.