విజయనగరం జిల్లాలోని రామతీర్థం ఆలయంపై దాడులు చేయించింది చంద్రబాబునాయుడేనని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబుతో పాటు లోకేశ్, అశోక్ గజపతిరాజు, స్థానిక తెదేపా నేతలకు నార్కో పరీక్షలు చేయిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో మాట్లాడిన మంత్రి.. దేవుడంటే చంద్రబాబుకు నమ్మకం లేదన్నారు. రాజకీయాల కోసమే రామతీర్థంలో పర్యటించారని విమర్శించారు. సీఎం జగన్కు లోకేశ్ సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. రామతీర్థం ఘటనపై విచారణ జరుగుతుందని.. దోషులెవరో త్వరలోనే తేలుతుందని తెలిపారు.
రామతీర్థం ఘటనపై వారికి నార్కో పరీక్షలు చేయాలి: మంత్రి కొడాలి నాని - రామతీర్థం వార్తలు
చంద్రబాబుతో పాటు లోకేశ్, అశోక్ గజపతిరాజులకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేస్తే రామతీర్థం ఘటనకు సంబంధించిన వాస్తవాలు బయటికొస్తాయన్నారు మంత్రి కొడాలి నాని. రాజకీయాల కోసమే తెదేపా నేతలు రామతీర్థంలో పర్యటిస్తున్నారని విమర్శించారు.
![రామతీర్థం ఘటనపై వారికి నార్కో పరీక్షలు చేయాలి: మంత్రి కొడాలి నాని minister kodali nani](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10103918-336-10103918-1609675977031.jpg)
minister kodali nani