మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో శనివారం ఆహారశుద్ధి విధానం 2020-25పై పరిచయ సదస్సు జరిగింది. కొత్త విధానంలో భాగంగా రూ.2,900 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నామని ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు. రైతుల ఆదాయాలను పెంచడం, పంట కోత తర్వాత వచ్చే నష్టాలను అరికట్టడం దీనిలో ప్రధాన ఉద్దేశాలని కన్నబాబు వివరించారు. ‘అరటి, టమాటా, ఉల్లి, బత్తాయి, మామిడి, మిరప, పసుపు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, కందుల ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం’ అని తెలిపారు.
ఆహారశుద్ధి రంగంలో హబ్‌లు, యూనిట్లు
*మెగా మాంసం శుద్ధి హబ్‌లు: తూర్పుగోదావరి జిల్లా శంఖవరం, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో..
* మెగా పాల శుద్ధి (ప్రాసెసింగ్) హబ్‌లు: విశాఖపట్నం, ఒంగోలు, గుంటూరు, పులివెందుల (కడప జిల్లా).
* మత్స్యరంగంలో: నియోజకవర్గ స్థాయిలో 150 ఆక్వాబజార్లు, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు, 10 ప్రాసెసింగ్ యూనిట్లు.
* విత్తన శుద్ధి రంగంలో: ఆర్‌బీకే (రైతు భరోసా కేంద్రాల) స్థాయిలో 2000 విత్తన శుద్ధి యూనిట్ల ఏర్పాటు, చిరుధాన్యాల శుద్ధి కోసం.
* క్లస్టర్/నియోజకవర్గ స్థాయిలో 50 (ప్రస్తుతం ఉన్నవి 17, కొత్తగా 33) సెకండరీ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్లు.