ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మిర్చి, మామిడి ధరలు పడిపోలేదు: మంత్రి కన్నబాబు - Minister Kannababu Latest News

మిర్చి, మామిడి ధరలు పడిపోలేదని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. మామిడి ధర పడిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారన్న మంత్రి... బత్తాయికి కూడా గతేడాది కంటే అధిక రేటు వస్తోందని చెప్పారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని వెల్లడించారు.

మంత్రి కన్నబాబు
మంత్రి కన్నబాబు

By

Published : Apr 22, 2021, 8:43 PM IST

రాష్ట్రంలో మిర్చి, మామిడి ధరలు పడిపోలేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. మిర్చికి గతేడాది మే నెలలో కంటే ఇప్పడు ఎక్కువ ధర ఉందని చెప్పారు. వ్యవసాయంపై సీఎం జగన్ నిరంతరం సమీక్షిస్తున్నారని మంత్రి కన్నబాబు వివరించారు. మామిడి ధర పడిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారన్న మంత్రి... బత్తాయికి కూడా గతేడాది కంటే అధిక రేటు వస్తోందని చెప్పారు. ప్రతి గ్రామంలోని ఆర్బీకేలో కొనుగోళ్లు జరగాలని సీఎం ఆదేశించారని కన్నబాబు తెలిపారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని చెప్పారు. రూ.2 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేశామని మంత్రి కన్నబాబు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details