ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈనెల 31 తేదీలోగా పంట నష్టం సర్వే పూర్తి: మంత్రి కన్నబాబు - minister kannababu on crop damage survey

ఈ నెల 31 తేదీలోగా పంట నష్టం సర్వే పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అన్నారు. పంటనష్టంపై త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర బృందం రానుందని వెల్లడించారు.

minister kannababu
minister kannababu

By

Published : Oct 29, 2020, 4:42 PM IST

ఈ నెల 31 తేదీలోగా పంట నష్టం సర్వే పూర్తి చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. అక్టోబరు నష్టాన్ని నవంబరులో చెల్లిస్తామని ఆయన వెల్లడించారు. మరోవైపు పంటనష్టం అంచనాలపై త్వరలోనే రాష్ట్రానికి కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి రాకేష్ కుమార్ సింగ్ నేతృత్వంలో కేంద్ర బృందం రానుందని తెలిపారు.

ఎన్జీరంగా వ్యవసాయ విద్యాలయం రూపొందించిన వ్యవసాయ పంచాంగాన్ని సచివాలయంలో మంత్రి కన్నబాబు ఆవిష్కరించారు. రైతులే స్వయంగా విత్తనాలు తయారు చేసుకునేలా రాష్ట్రంలో విత్తన గ్రామం కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ వ్యవసాయ పంచాంగాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,641 రైతు భరోసా కేంద్రాలకు పంపిణీ చేస్తామన్నారు. సీజన్ వారీగా పంటలు, భూసార పరీక్షలు, మార్కెటింగ్ వివరాలు, నూతన వంగడాల వంటి అంశాలను వ్యవసాయ పంచాంగంలో పొందుపర్చినట్టు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details