ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమరావతిలో పెండింగ్​ పనులు కొలిక్కి తెస్తాం : మంత్రి కన్నబాబు - అమరావతి వార్తలు

రాజధాని అమరావతిపై మంత్రి కన్నబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం త్వరలోనే అమరావతిలో పెండింగ్ ఉన్న పనులను కొలిక్కి తేవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

kanna babu on capital amamravathi
అమరావతిలో పెండింగ్​ పనులు కొలిక్కి తెస్తాం : మంత్రి కన్నబాబు

By

Published : Feb 25, 2021, 3:54 AM IST

అమరావతిలో పెండింగ్ ఉన్న పనులను కొలిక్కి తేవాలని ప్రభుత్వం చూస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు సీఎం జగన్​పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని.. అమరావతిని నిర్లక్ష్యం చేస్తామని ప్రభుత్వం చెప్పలేదన్నారు.

చంద్రబాబు రెండు రకాలుగా మాట్లాడతారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకు మెజారిటీ వచ్చిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం అదే తీర్పు వస్తుందని పేర్కొన్నారు. వైకాపాకు కుప్పం, ఇచ్ఛాపురం ఎక్కడైనా రిజల్ట్ ఓకేలా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవినీతిని అరికట్టాలనే ఉద్దేశంతోనే దుర్గ గుడిలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details