ఇఫ్కో సంస్థ తయారు చేసిన నానో యూరియాను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలకు సరఫరా చేసేందుకు గుజరాత్లో సిద్ధంగా ఉంచిన వాహనాన్ని వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇఫ్కో తయారు చేసిన నానో యూరియాను రైతులకు పంపిణీ చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు.
అరలీటరు నానో యూరియా 45 కేజీల యూరియా బస్తాతో సమానమని మంత్రి స్పష్టం చేశారు. గడచిన రెండేళ్లలో రైతుల కోసం రూ. 83 వేల కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి తెలిపారు. నెల్లూరులోని ఇఫ్కో కిసాన్ సెజ్ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారిస్తామని మంత్రి స్పష్టం చేశారు.