ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఈనెల30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం: కన్నబాబు

రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై జిల్లాల జేసీలకు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు దిశానిర్దేశం చేశారు. 30 తేదీన ఏడాది పాలనకు గుర్తుగా 10, 641 కేంద్రాలు, కియోస్క్ లు ప్రారంభం అవుతాయని తెలిపారు.

minister-kannababu
minister-kannababu

By

Published : May 27, 2020, 7:51 PM IST

మంత్రి కన్నబాబు

రైతులకు రూ.10,209 కోట్ల సాయం చేసిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని మంత్రి కన్నబాబు ఉద్ఘాటించారు. రూ.3 వేల కోట్లతో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ నిధులు సిద్ధం చేశామని చెప్పారు. రైతులెవరూ రోడ్డెక్కే పరిస్థితి తమ ప్రభుత్వం రానివ్వదని స్పష్టం చేశారు.

రైతుల సలహాలు వినేందుకు సలహా మండళ్లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ బోర్డుల్లో కౌలురైతు, మహిళా రైతు ఉండేలా చూస్తున్నామని వివరించారు. రైతుభరోసా కేంద్రాల ఏర్పాటుపై జేసీలకు దిశానిర్దేశం చేశామని తెలిపారు. ఏడాది పాలనకు గుర్తుగా ఈనెల 30న 10,641 కేంద్రాలు, కియోస్క్‌లు ప్రారంభిస్తున్నట్లు మంత్రి కన్నబాబు వెల్లడించారు. మహానాడు తీర్మానాల్లో ప్రజలకు మేలు చేసేది ఒక్కటైనా ఉందా ఉంటూ విమర్శలు గుప్పించారు. రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం అయ్యాక తెదేపా నేతలు సందర్శించండి అంటూ హితవు పలికారు.

ఇంటర్నెట్‌ ద్వారా నిపుణులతో రైతులు మాట్లాడేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం. భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ, మత్స్యశాఖ సిబ్బంది సేవలు అందిస్తారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా 5 లక్షల మందితో మాట్లాడతాం. అధికారులు, ఎమ్మెల్యేలు వారంరోజుల పాటు ఈ రైతు భరోసా కేంద్రాలను సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నాం- కన్నబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

ఇదీ చదవండి:

డిజిటల్ ఫ్లాట్​ ఫాంపై 'పసుపు జెండా'.. ఇది ఓ ప్రయోగమే!

ABOUT THE AUTHOR

...view details