ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యం దుకాణం ముందు మహిళల బారులపై మంత్రి స్పందన - ap minister kannababu about liquor in andhra

రాష్ట్రంలో మద్య నిషేధమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంటే... కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. మద్యం దుకాణాల ముందు మహిళలు బారులపై కన్నబాబు స్పందించారు.

minister kannababu
మద్యం దుకాణం ముందు మహిళల బారులపై మంత్రి స్పందన

By

Published : Jul 18, 2020, 4:26 PM IST

మద్యం దుకాణం ముందు మహిళల బారులపై మంత్రి స్పందన

దశలవారీగా మద్య నిషేధం చేస్తామని సీఎం వైఎస్ జగన్ ఎన్నికల సమయంలోనే చెప్పారని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. అధికారంలోకి రాగానే మద్యం బాటిల్ ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా ధరలు పెంచారన్నారు. 14 వేల అక్రమ మద్యం బాటిళ్లు రోడ్డు రోలర్​తో తొక్కించామని... ఇంత చేస్తుంటే కొందరు గిట్టక వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం బాటిళ్లను అక్రమంగా విక్రయిస్తే తీవ్రంగా పరిగణిస్తామని పేర్కొన్నారు. ధరలు పెరిగిన కారణంగా అమ్మకాలు తగ్గాయన్నారు. మద్యం షాపుల ముందు మహిళలు బారులు తీరి...వాటిిని బెల్టు దుకాణాల్లో ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్లు కొన్ని పత్రికలు రాశాయన్నారు.

ఇవీ చూడండి:నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు సబ్సిడీపై విత్తనాలు: కన్నబాబు

ABOUT THE AUTHOR

...view details