తెలంగాణ మంత్రి హరీశ్ సారథ్యంలోని సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్, హైదరాబాద్‌కు చెందిన మెడికవర్ ఆసుపత్రి జట్ల మధ్య బుధవారం రాత్రి స్నేహపూర్వక టీ20 మ్యాచ్ జరిగింది. సిద్దిపేట లఘు క్రీడామైదానం ఈ మ్యాచ్‌కు వేదికైంది. సిద్దిపేట జట్టు 15 పరుగుల తేడాతో విజేతగా నిలిచింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన సిద్దిపేట నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన సిద్దిపేట జట్టు బ్యాట్స్‌మెన్ బౌండరీల వరద పారించారు. ఆ జట్టులో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన మంత్రి హరీశ్‌రావు క్రీజులో ప్రొఫెషనల్ క్రికెటర్లా కనిపించారు. 12 బంతుల్లోనే 3ఫోర్ల సాయంతో 18 పరుగులు చేశారు. క్రీజులో ఉన్నంత సేపూ మెరుపు బ్యాటింగ్‌తో... సహచర ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు.
తీవ్ర ఉత్కంఠ..