తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్ రావు రైతుబంధు పథకం కోసం 14,800 కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. రైతుకు పెట్టుబడి సహాయం అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2018లో రైతుబంధును ప్రవేశపెట్టిందని... ఈ పథకం యావద్దేశానికే ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. కరోనాతో రాష్ట్ర ఆదాయం తగ్గినప్పటికీ... రైతుబంధు సాయాన్ని మాత్రం ప్రభుత్వం ఆపలేదని పేర్కొన్నారు.
తెలంగాణ: రైతుబంధు పథకానికి 14,800 కోట్లు: హరీశ్ రావు - అసెంబ్లీ సమావేశాలు 2021
తెలంగాణలో రైతుబంధు పథకం కోసం 14,800 కోట్ల రూపాయలను ఆ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రతిపాదించారు. గడిచిన మూడేళ్లలో రైతుబంధు కింద 35,911 కోట్ల రూపాయాలు ఇచ్చినట్లు వెల్లడించారు. 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే లబ్ధిపొందారని తెలిపారు.
RAITHU BANDHU
ఈ పథకం కింద 2021 వానాకాలం, యాసంగిలో 59,25,725 మంది రైతులకు రూ.14,736 కోట్లను ప్రభుత్వం అందించిందని మంత్రి వెల్లడించారు. గడిచిన మూడేళ్లలో రైతుబంధు కింద 35,911 కోట్ల రూపాయలను ఇచ్చిందని తెలిపారు. లబ్దిపొందిన రైతుల్లో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి