ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రానున్న రోజుల్లో 60 లక్షల మందికి ఫైబర్ నెట్ సేవలు' - ఏపీ ఫైబర్ నేట్ సేవలు

రానున్న 2-3 ఏళ్లలో... 60 లక్షల మందికి ఫైబర్ నెట్ సేవలు విస్తరిస్తామని ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. ఏపీ ఫైబర్ నెట్ సేవలపై సమీక్ష నిర్వహించిన మంత్రి... పంచాయతీలు, మండలాల్లో సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

By

Published : Jul 15, 2020, 10:08 PM IST

రానున్న రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ సహా కేబుల్ టీవీ సదుపాయాలను కల్పిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఫైబర్ నెట్ కు మంచి డిమాండ్ ఉందని... రానున్న 2-3 ఏళ్లలో 60 లక్షల సబ్ స్క్రైబర్లకు ఫైబర్ నెట్ సేవలు విస్తరిస్తామని మంత్రి తెలిపారు. సచివాలయంలో ఏపీఎస్ఎఫ్ఎల్(ఏపీ స్టేట్ ఫైజర్ నెట్ లిమిటెడ్)పై మంత్రి సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఎస్ఎఫ్ఎల్ ఎండీ మధుసూదన్ రెడ్డి, అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ఇప్పటికే 10 లక్షల మందికి పైగా ఏపీ ఫైబర్ నెట్ ఉపయోగిస్తున్నారని మంత్రి తెలిపారు. గ్రామపంచాయతీలు, మండలాలలో పక్కాగా ఫైబర్ నెట్ వర్క్ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఉండేలా చూడడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కొత్త పరికరాల సేకరణ, అంచనా, ఆర్థిక భారం తగ్గించేందుకు 'టెక్నికల్ కమిటీ' ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీ, మండలాల్లో కేబుల్ రూటర్ల సంఖ్య వీలైనంతవరకూ తగ్గించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. తద్వారా గ్రామీణ ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులో తీసుకురావాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details