ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Dubai Expo-2022: దుబాయ్​లో జరిగే ఎక్స్‌పో-2022కు రాష్ట్ర బృందం

State team for the Dubai Expo-2022: దుబాయ్‌ వేదికగా ఈ నెల 11 నుంచి వారం రోజుల పాటు జరిగే ఎక్స్‌పో-2022కు రాష్ట్రం తరఫున అధికారుల బృందం పర్యటించనుంది. ఈ పర్యటనకు సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి గౌతమ్‌రెడ్డి సమీక్షించారు.

By

Published : Feb 4, 2022, 9:11 AM IST

minister gouthareddy
దుబాయ్‌ ఎక్స్‌పోకు రాష్ట్ర బృందం

Dubai Expo-2022: దుబాయ్‌లో ఈ నెల 11 నుంచి వారం రోజుల పాటు జరిగే ఎక్స్‌పో-2022లో రాష్ట్రం తరఫున అధికారుల బృందం పాల్గొంటుందని మంత్రి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ పర్యటనకు సన్నద్ధతపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహార, సరకు రవాణా కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ప్రదర్శనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు, ఫిషింగ్‌ హార్బర్లు, విద్య, వైద్యం, పర్యాటక, ఐటీ, పోర్టులు సహా పలురంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు ఉండాలి. రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టులు, పర్యాటక, హెల్త్‌ హబ్‌లు, కడప స్టీలు ప్లాంటు, ఫిషింగ్‌ హార్బర్లు, పారిశ్రామిక పార్కులు, పారిశ్రామిక కారిడార్లు, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఆహార శుద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పెట్టుబడులకు ఆస్కారం ఉన్న వివిధ అంశాలపై ప్రజెంటేషన్‌ ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు పరిశ్రమల శాఖ అధికారులు మంత్రికి వివరించారు.

దుబాయ్‌ ఎక్స్‌పోలో నిర్వహించే కార్యక్రమాలు

  • ఈ నెల 13న వందమంది సభ్యులతో రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రదర్శనలు
  • 14న ప్రముఖ సంస్థల అధిపతులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం. సాయంత్రం 250 మంది పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో సమావేశం
  • 15న వివిధ ఎమిరేట్‌ కంపెనీల ప్రతినిధులతో అధికారుల సమావేశం
  • 16న ‘ముబదల’ పెట్టుబడుల కంపెనీతో మంత్రి సమావేశం.. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన పరిస్థితిని వివరిస్తారు.

ఇదీ చదవండి..:Asset value increase: ఆస్తుల విలువ పెంపు... ఏప్రిల్‌ 1 నుంచి అమలు

ABOUT THE AUTHOR

...view details