రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాలు, నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు కావలసిన భూములను గుర్తించి డిజైన్లను వేగంగా ఖరారు చేయాలని మంత్రి గౌతమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరలో ఏర్పాటు కానున్న పరిశ్రమలకు స్థానికంగా నైపుణ్యం ఉన్న యువతను సిద్ధం చేసేందుకు త్వరతిగతిన నైపుణ్య కళాశాలలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా 25 నైపుణ్య కళాశాలల ఏర్పాటుతో పాటు 2 విశ్వవిద్యాలయాలను కూడా నైపుణ్యాభివృద్ధి రంగంలో ఏర్పాటు చేయాల్సి ఉందని మంత్రి తెలిపారు.
'నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు భూములను గుర్తించండి'
పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులతో మంత్రి గౌతంరెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాలు, నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు కావలసిన భూములను గుర్తించి డిజైన్లను వేగంగా ఖరారు చేయాలని ఆదేశించారు.
minister-gautam-reddy-review-with-the-officials-of-the-professional-development-agency-over-establishments-of-skill-centers-in-state