పాలిసెట్-2021 ఫలితాలను పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి విడుదల చేశారు. మొత్తం 68,137 మంది పాలిసెట్ పరీక్షకు హాజరుకాగా వారిలో 64,187 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. 120మార్కులతో విశాఖ కు చెందిన కె.రోషన్ లాల్, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వివేక్ వర్ధన్‌లకు మొదటి ర్యాంకు వచ్చినట్లు పేర్కొన్నారు. వారం రోజుల్లో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు.
Polycet results: పాలిసెట్-2021 ఫలితాలు విడుదల - పాలిసెట్ ఫలితాలు
రాష్ట్రంలో పాలిసెట్-2021 ఫలితాలను మంత్రి గౌతమ్ రెడ్డి విడుదల చేశారు. మొత్తం 64,187 మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి తెలిపారు. పాలిసెట్ ఫలితాల్లో ఇద్దరికి మొదటి ర్యాంకు వచ్చిందన్నారు. పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు తీసుకొస్తున్నామన్నారు.
81 వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.128 కోట్లు అందించామని... వసతి దీవెన ద్వారా రూ.54 కోట్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. కొన్ని రకాల ప్రత్యేక పరిస్థితుల వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వెళ్లిపోయేవారని.. ఇప్పుడు దాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. పాలిటెక్నిక్ లో కొత్త కోర్సులు కూడా తీసుకురావడంతో పాటు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. నైపుణ్యాలను గణనీయంగా పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్, ఐటీఐ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని తెలిపారు. దీని కోసం ఓ కమిటీ నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఇదీ చదవండి