ఉన్నతాధికారులతో మంత్రి ధర్మాన, ప్రభుత్వ సలహాదారు సజ్జల భేటీ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే, ఇళ్లపట్టాల పంపిణీపై చర్చించారు. అసైన్డ్ భూముల కమిటీల ఏర్పాటుపై సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో అసైన్డ్ భూముల కమిటీల ఏర్పాటుపై సమాలోచనలు చేశారు. కొన్నేళ్లుగా రైతులకు ఒక్క సెంటు సాగుభూమి ఇవ్వలేదని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. మాగాణి 2, మెట్ట 2.5 ఎకరాలను అసైన్డ్ భూములుగా ఇవ్వడంపై చర్చించారు.
Assigned Lands: అసైన్డ్ భూముల కమిటీల ఏర్పాటుపై మంత్రి ధర్మాన సమీక్ష - ఏపీలో భూముల రీసర్వే తాజా వార్తలు
రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే, ఇళ్లపట్టాల పంపిణీపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన, ప్రభుత్వ సలహాదారు సజ్జల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. అసైన్డ్ భూముల కమిటీ ఏర్పాటుపై చర్చించారు.
assigned land committees in AP