ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

land re resurvey: రీసర్వేతో రికార్డుల ప్రక్షాళణ సాధ్యం: మంత్రుల కమిటీ - ఏపీలో భూ సర్వేపై మంత్రుల కమిటీ వ్యాఖ్య

శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకం ద్వారా రికార్డుల ప్రక్షాళణ అవుతుందని మంత్రుల కమిటీ పేర్కొంది. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు - భూరక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ భేటీ అయ్యింది.

minister committee meeting on resurvey in andhra pradesh
minister committee meeting on resurvey in andhra pradesh

By

Published : Aug 5, 2021, 5:34 PM IST

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు - భూ రక్ష పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశం అయ్యింది. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, అధికారులు హాజరయ్యారు. వంద సంవత్సరాల తర్వాత తొలిసారి ఈ తరహా సమగ్ర సర్వేతో భూ వివాదాలకు చెక్ పడనుందని మంత్రులు అన్నారు.

ఇందుకోసం రాష్ట్రంలో మొత్తం 70 కార్స్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సమగ్ర సర్వే కోసం 13,371 పంచాయతీ కార్యదర్శులు, 10,935 మంది డిజిటల్ అసిస్టెంట్లు, 10,185 మంది గ్రామ సర్వేయర్లకు బాధ్యతలు అప్పగించినట్లు వివరించారు. రీ సర్వేతో రికార్డుల ప్రక్షాళన అవుతుందని మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details