ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MINISTERS COMMITTEE MEET: సీఎం జగన్​కు మంత్రుల కమిటీ నివేదిక.. కాసేపట్లో ఉద్యోగ సంఘాలతో భేటీ

MINISTERS COMMITTE MEET: సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఉద్యోగుల డిమాండ్లను సీఎం జగన్‌కు కమిటీ నివేదించింది. మరికాసేపట్లో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే మంత్రులు బుగ్గన, బొత్స, పేర్ని నాని సచివాలయానికి బయల్దేరారు.

కాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ
కాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ

By

Published : Feb 5, 2022, 9:45 AM IST

Updated : Feb 5, 2022, 2:52 PM IST

MINISTERS COMMITTE MEET: సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయిన మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఉద్యోగుల డిమాండ్లను సీఎం జగన్‌కు మంత్రుల కమిటీ నివేదించింది. మరికాసేపట్లో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ భేటీ కానుంది. ఇప్పటికే మంత్రులు బుగ్గన, బొత్స, పేర్ని నాని సచివాలయానికి బయల్దేరారు.

చిన్న చిన్న విషయాలే: బొత్స

‘‘నిన్న అర్ధరాత్రి వరకు ఉద్యోగులతో చర్చించాం. ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి, ఆవేదనకు పరిష్కారం చూపాం. ఈ మధ్యాహ్నం మళ్లీ ఉద్యోగులతో సమావేశమవుతాం. హెచ్‌ఆర్‌ఏ శ్లాబుల గురించి ఈ రోజు చర్చిస్తాం. ఐఆర్‌ రికవరీ విషయంలో స్పష్టత ఇచ్చాం. దీని వల్ల ప్రభుత్వంపై రూ.6 వేల కోట్లు భారం ఉండొచ్చని అనుకుంటున్నాం. ఇక మిగిలిన సమస్యలు అన్నీ చిన్న చిన్న విషయాలే. చర్చల అనంతరం అన్ని అంశాలు సీఎం జగన్‌కు వివరిస్తాం’’ అని బొత్స అన్నారు.

ఫిట్​మెంట్​ 23 శాతంలో మార్పుండదు..

ఉద్యోగుల డిమాండ్లపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఎంత ఆర్థిక భారం పడుతుందనే అంశంపై చర్చించాలన్న ఆయన.. ఫిట్​మెంట్ 23 శాతంలో మార్పు ఉండదని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు అడిగారన్న సజ్జల...హెచ్​ఆర్ఏ శ్లాబుల్లో సవరణలతో రూ. 7వేల కోట్ల వరకు భారం పడుతుందన్నారు. హెచ్ఆర్​ఏలో పాత శ్లాబులే కొనసాగించాలని, కనీస హెచ్​ఆర్​ఏ 12 శాతం ఉండాలని ఉద్యోగులు అడిగినట్లు సజ్జల వెల్లడించారు.

ఇదీ చదవండి:

పీఆర్సీ నివేదికపై రాని స్పష్టత... నేడు మరోసారి భేటీ

Last Updated : Feb 5, 2022, 2:52 PM IST

ABOUT THE AUTHOR

...view details