ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రఘురామకృష్ణరాజుపై మంత్రి రంగనాథరాజు ఫిర్యాదు.. తప్పుబట్టిన ఎంపీ - ఎంపీ రఘురామకృష్ణరాజు

ఎంపీ రఘురామకృష్ణరాజుపై మంత్రి శ్రీరంగనాథరాజు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంపీ చేసిన వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.

minister cherukuwada
minister cherukuwada

By

Published : Jul 8, 2020, 5:31 PM IST

తనపై ఎంపీ రఘురామకృష్ణరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి శ్రీరంగనాథరాజు పశ్చిమగోదావరి జిల్లా పోడూరు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఎంపీ వ్యాఖ్యలు తనకు పరువునష్టం కలిగించాయని పేర్కొన్నారు. ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

రఘురామకృష్ణరాజు స్పందన

మంత్రి శ్రీరంగనాథరాజు ఫిర్యాదును ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు. తన దిష్టిబొమ్మ దహనం చేశారని ఫిర్యాదు చేసి 20 రోజులైనా కేసు పెట్టలేదని అన్నారు. తానే మంత్రి దిష్టిబొమ్మ దహనం చేశానని తప్పుడు ఫిర్యాదు చేశారని ఆరోపించారు.

ఇదీ చదవండి:

నిమ్మగడ్డ కేసులో ఏపీ ప్రభుత్వ వాదనను తిరస్కరించిన సీజేఐ

ABOUT THE AUTHOR

...view details