థర్మల్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్న ధరలు అధికంగా ఉన్నందున వాటిని తగ్గించాలని కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్.కె. సింగ్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రితో బుగ్గన , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా గురువారం సమావేశమయ్యారు.
రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్తు ఆర్థిక సంస్థ (పీఎఫ్సీ), గ్రామీణ విద్యుదీకరణ సంస్థల్లో (ఆర్ఈసీ) చేసిన రుణాల చెల్లింపు ప్రక్రియ పునర్నిర్మానానికి (డెబిట్ రీస్ట్రక్టర్) సహకరించాలని కేంద్రమంత్రిని కోరారు. అనంతరం బుగ్గన బృందం ఆర్ఈసీ ఛైర్మన్, సంజయ్ మల్హోత్రా, పీఎఫ్సీ ఛైర్మన్ రవీందర్‌సింగ్ థిల్లాన్‌లతో వేర్వేరుగా సమావేశమైంది. రుణాల చెల్లింపు ప్రక్రియ పునర్నిర్మాణానికి సహకరించాని రెండు సంస్థల ఛైర్మన్లకు మంత్రి బుగ్గన విజ్ఞప్తి చేశారు.