ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ విద్యార్థుల సమస్యలపై కేటీఆర్​కు బొత్స విన్నపం - minister botsa talks with tg min ktr

తెలంగాణలో ఇరుక్కుపోయిన ఆంధ్రా విద్యార్థుల సమస్యలను.. మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ మంత్రి కేటీఆర్​తో చర్చించారు. స్పందించిన తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే హైదరాబాద్​లోని ఏపీ విద్యార్థులు అక్కడే ఉండాలని.. సమస్యలుంటే 1092కు సంప్రదించాలని సూచించింది.

minister botsa talks with tg min ktr
తెలంగాణలోని ఏపీ విద్యార్థుల గురించి కేటీఆర్​తో సంప్రదింపులు జరిపిన మంత్రి బొత్స

By

Published : Mar 26, 2020, 5:51 AM IST

హైదరాబాద్‌లో విద్యార్థుల అవస్థను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ దృష్టికి తీసుకెళ్లింది. హైదరాబాద్‌లోని హాస్టళ్లు, మెస్‌ల మూసివేత, ఏపీ విద్యార్థుల అగచాట్లపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. తెలంగాణలో ఉన్న రాష్ట్ర విద్యార్థులను హాస్టళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారని.. వారికి రవాణా ఇబ్బందులు వస్తాయన్నారు. ఒకచోట నుంచి ఇంకో చోటకు కదలడం శ్రేయస్కరం కాదని మంత్రి బొత్స తెలిపారు. ఇదే అంశాలను ఏపీ సీఎస్​.. తెలంగాణ సీఎస్​ దృష్టికి తీసుకెళ్లారు. స్వస్థలాలకు వెళ్లేందుకు పోలీసులు ప్రత్యేకంగా పాసులు ఇస్తున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయని సీఎస్​ నీలం సాహ్ని తెలిపారు.

కేటీఆర్​ స్పందన

రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనపై స్పందించిన తెలంగాణ మంత్రి కేటీఆర్​.. సంప్రదింపుల తర్వాత హాస్టళ్లు, పీజీ మెస్‌లు మూసివేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. హాస్టళ్ల యజమానులతో సంప్రదింపులు జరపాలని సిటీ పోలీస్‌ కమిషనర్, మేయర్‌కు నిర్దేశించారు. హైదరాబాద్‌లోని ఏపీ విద్యార్థులు ఎక్కడివారు అక్కడే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏమైనా సమస్యలు ఉంటే 1902కు సంప్రదించాలని సూచించింది.

ఇదీ చదవండి:

కరోనా ప్రభావంపై రాష్ట్రవ్యాప్త సమగ్ర సర్వే

ABOUT THE AUTHOR

...view details