రాజధానిలో ఒక్క పనికీ పాలనామోదం లేకుండానే... రూ.40 వేల కోట్ల టెండర్లను పిలిచారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి సాక్ష్యాలున్నాయని పునరుద్ఘాటించారు. స్టార్టప్ అభివృద్ధి ప్రాంతానికి సంబంధించి... సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందం రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు. పరస్పర అంగీకారంతో... ఈ ప్రాజెక్టు రద్దైందని మంత్రి వివరించారు.
అమరావతితో సింగపూర్ ఒప్పందం రద్దు... కేటాయించిన భూములు వెనక్కి - botsa sensational comments on tdp
దేశంలో ఎక్కడా 50 అంతస్తుల ప్రభుత్వ భవనాలు లేవని... మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజధాని పనులకు 2018 డిసెంబరులో రూ.40 వేల కోట్ల టెండర్లు పిలిచారని... ఒక్క పనికీ పాలనామోదం లేదని వివరించారు. సింగపూర్ కన్సార్షియంతో ఒప్పందం రద్దు చేసుకున్నట్టు వెల్లడించారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజధాని కడతామని ప్రకటించి... అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. అమరావతిని గ్రాఫిక్స్ చేశారని... పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చారో చంద్రబాబు చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. చంద్రబాబు హైదరాబాద్లో ఖరీదైన ఇల్లు కట్టుకుని ప్రజల్ని మాత్రమే... అడవిలో పడేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఇక్కడ అడ్రస్ లేదని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండీ... తప్పుడు వార్తలు రాస్తే కేసులే...!