ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మాకు ఎవరి పైనా కక్ష లేదు: మంత్రి బొత్స - మాజీమంత్రి అచ్చెన్నాయుడి అరెస్ట్ వార్తలు

తెలుగుదేశం నేత అచ్చెన్నాయుడు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని మంత్రి బొత్స అన్నారు. తాము చేసింది తప్పయితే న్యాయస్థానాలకు వెళ్లాలని సూచించారు. బీసీ వర్గాలకు భరోసా ఇచ్చింది తమ పార్టీనేనని... తమకు ఎవరిపైనా కక్ష లేదని బొత్స తెలిపారు.

minister botsa satyanaryana
మంత్రి బొత్స సత్యనారాయణ

By

Published : Jun 12, 2020, 7:30 PM IST

మాజీమంత్రి అచ్చెన్నాయుడు విషయంలో చట్టం తన పని చేసుకుపోతోందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెదేపానేతలు మెుదట చెప్పాల్సింది.. 'నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేశారని కాదు... అక్రమాలు జరగలేదని' చెప్పాలన్నారు. 130 శాతం ఎక్కువకు కొన్నారని నివేదిక స్పష్టం చేసిందన్నారు. అవినీతిపై పోరాటం చేస్తామని జగన్ ఎన్నికల ముందే చెప్పారని.. మేం చేసింది తప్పయితే న్యాయస్థానాలకు వెళ్లండని బొత్స సూచించారు. మీరు చేసిన అక్రమాలు ఒకటా.. రెండా.. అనేకం ఉన్నాయని విమర్శించారు. భోగాపురం విమానాశ్రయ ఒప్పందంలో 500 ఎకరాలు తగ్గించామన్నారు.

నోటీసు ఇవ్వకుండా ఎవరైనా అరెస్ట్ చేస్తారా..?

నేను కూడా బలహీనవర్గ వ్యక్తినే.. నాపైనా అనేక నిందలు వేశారని ఈ సందర్భంగా బొత్స గుర్తుచేశారు. బీసీ వర్గాలకు భరోసా ఇచ్చిన పార్టీ మాదేనన్నారు. నోటీసు ఇవ్వకుండా ఎవరైనా అరెస్టు చేస్తారా? అని మంత్రి ప్రశ్నించారు. తెదేపా పాలనపై ఆరోపణలు చేసే మేం అధికారంలోకి వచ్చామన్నారు.

ఒక్కొక్కటీ బయటకు తీస్తున్నాం...

మీకంటే, మాకంటే ప్రజలు చాలా తెలివైనవాళ్లని.... వ్యవస్థలను కాపాడుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బొత్స అన్నారు. మీరు చేసిన అక్రమాలు ఒక్కొక్కటీ బయటకు తీస్తున్నాం... మాకు ఎవరిపైనా కక్ష లేదని, మీ అవినీతిపై ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే చర్యలు తీసుకుంటున్నామని....,పేదల కోసం పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నామని బొత్స పేర్కొన్నారు.

ఇవీ చదవండి:'ప్రశ్నిస్తున్నందుకే.. అచ్చెన్నను అరెస్ట్ చేశారు'

ABOUT THE AUTHOR

...view details