ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతాం: బొత్స - AP News

మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా సీఎం జగన్ పరిపాలన చేశారన్నారు. ప్రభుత్వం చేసిన అరాచకం ఏమిటో చెప్పాలని తెదేపా నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

బొత్స సత్యనారాయణ
బొత్స సత్యనారాయణ

By

Published : May 30, 2021, 5:36 PM IST

బొత్స సత్యనారాయణ

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నారని, ఇప్పటికే 94శాతం హామీలు నెరవేర్చారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా మరో 40 హామీలు నెరవేర్చినట్టు వివరించారు. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ప్రతి లబ్ధిదారుడికి నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నగదు బదిలీ చేశామని పేర్కొన్నారు.

రెండేళ్ల పాలనపై సీఎం జగన్ విడుదల చేసిన పుస్తకాన్ని.. ప్రతి లబ్ధిదారుడికి పంపిస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం విధానమన్న బొత్స.. 3 రాజధానులను ఏర్పాటు చేసి.. అభివృద్ధి చేస్తున్నామన్నారు.

తప్పకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. జగన్ పాలనపై లోకేశ్ ఆరోపణలన్నీ పిచ్చివని.. జగన్ ఇచ్చిన మాట ఏది తప్పారో లోకేశ్ నిరూపించాలని డిమాండ్ చేశారు. తెదేపా నేతలు ఆరోపిస్తున్న ప్రభుత్వం చేసిన అరాచకం ఏమిటో చెప్పాలన్నారు.

ఇదీ చదవండీ... CM Jagan: 'మేనిఫెస్టో హామీల్లో 94శాతం పూర్తి చేశాం'

ABOUT THE AUTHOR

...view details