Minister Botsa Comments: మేము తలుచుకుంటే 5 నిమిషాల్లో అమరావతి రైతుల పాదయాత్ర ఆపుతానన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతుంది అమరావతి రైతుల పాదయాత్ర కాదని.. రియల్ ఎస్టేట్ యాత్రని ఆరోపించారు. ఇక్కడ వారు అక్కడ అభివృద్ధిని అడ్డుకుంటే చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగిందన్నారు.
తలచుకుంటే ఐదు నిమిషాల్లోనే.. ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స - అమరావతి రైతుల పాదయాత్ర
Minister Botsa sensational comments on Amaravati Farmers Padayatra: అమరావతి రైతుల పాదయాత్రపై మరోసారి మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము తలచుకుంటే ఐదు నిమిషాల్లోనే యాత్ర ఆపుతామన్న తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ముందే అన్ని మీకు చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు.
minister botsa
గత ప్రభుత్వం అమరావతి రైతులతో చేసుకున్న ఒప్పందాలను తాము అమలు చేస్తున్నామన్నారు. పోలవరం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులది త్యాగమని.. అమరావతి రైతులు చేసింది త్యాగం ఎలా అవుతుందని ప్రశ్నించారు. అమరావతి రైతులు భూములు ఇచ్పి ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు పొందారని పేర్కొన్నారు. యాత్రను ఎలా ఆపగలమో చూస్తారా.. ముందే అన్ని మీకు చెప్పి చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
ఇవీ చదవండి: