minister botsa on OTS: పేదల సంక్షేమానికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో మంచి కార్యక్రమం తెచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం పక్కా ప్రణాళిక ప్రకారం తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో 55 లక్షల మంది పేదలు ఇళ్లు నిర్మించుకున్నారన్న మంత్రి... ఓటీఎస్ అనేది బలవంతపు పథకం కాదని స్పష్టం చేశారు. నిర్ణీత రుసుం చెల్లిస్తే ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించారు.
minister botsa on OTS: ఈ నెల 20 నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తాం: మంత్రి బొత్స
minister botsa: పేదల సంక్షేమానికి వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో మంచి కార్యక్రమం తెచ్చామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలుగుదేశం పక్కా ప్రణాళిక ప్రకారం తప్పుడు ప్రచారాలు చేస్తోందని ఆయన ఆరోపించారు.
పట్టణాల్లో 15 లక్షల విలువైన ఇంటిని 25 వేలకే రిజిస్ట్రేషన్ చేసకోవచ్చన్న మంత్రి... ఓటీఎస్‌ను ప్రజలు ఎక్కడా వ్యతిరేకించలేదని తెలిపారు. ఈ నెల 20 నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తామన్న బొత్స... ఓటీఎస్‌తో రిజిస్ట్రేషన్ చేస్తే ఇంటిపై పూర్తి హక్కులు వస్తాయని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ అయ్యాక ఎవరైనా ఇళ్లు అమ్ముకోవచ్చని...బ్యాంకులో ఇళ్లు తాకట్టు పెట్టి రుణం తీసుకునే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:సీఎం జగన్‌తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ సమావేశం