ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఉగాది నాటికి పేదలందరికీ  ఉచితంగా ఇళ్ల పట్టాలు' - botsa satyanarayana plot distribution

ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్ఘాటించారు. ఇళ్లస్థలాల లబ్ధిదారుల వద్ద నయాపైసా కూడా తీసుకోబోమని స్పష్టం చేశారు. వందశాతం ఉచితంగా పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామని పేర్కొన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ

By

Published : Oct 17, 2019, 6:10 PM IST

ఉగాది నాటికి రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రంలో 20 లక్షల మంది అర్హులను గుర్తించామని వెల్లడించారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామన్న మంత్రి బొత్స... పట్టణాల్లో అవకాశమున్న మేరకు వ్యక్తిగత ఇళ్లు కట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర స్థలంలో ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

వ్యక్తిగత ఇళ్లే ఇస్తాం

జీ-ప్లస్ ఇళ్ల నిర్వహణ ఇబ్బందిగా ఉండటంతో వ్యక్తిగత ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు మంత్రి బొత్స చెప్పారు. పట్టణాల్లో 8 లక్షలమంది ఇళ్ల కోసం అర్హులు ఉన్నారని వివరించారు. పీఎం అవాస్ యోజన పథకం అనుసంధానంతో ఇళ్ల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారని వివరించారు. పేదల ఇళ్లస్థలాల కోసం ప్రభుత్వ భూములు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

ప్రైవేట్‌ స్థలాలు కొంటాం

పలుచోట్ల భూమి కొనుగోలు చేసి పేదలకు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. ప్రైవేట్‌ స్థలాల కొనుగోలుకు రూ.12 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశామన్న బొత్స... పట్టణాల్లో 11 వేల ఎకరాలు అవసరమని గుర్తించినట్లు చెప్పారు. ఎక్కడా అవినీతికి తావు లేకుండా పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తామని పునరుద్ఘాటించారు. అనేక ఇబ్బందులున్నా పేదలకు ఇళ్లస్థలాలు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు.

త్వరలోనే రాజధాని రైతులకు ప్లాట్లు

రాజధాని, ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాజధాని రైతులకు త్వరలోనే లాటరీ వేసి ప్లాట్లు ఇస్తామని చెప్పారు. తుళ్లూరులో నిర్మించిన సీఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని 4 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ

ఇదీ చదవండీ... విలేకరి హత్య... వైకాపా ఎమ్మెల్యేపై కేసు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details