ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైఎస్సార్​ ఆసరా.. ఎల్లుండే ప్రారంభం: మంత్రి బొత్స - వైఎస్సాఆర్ ఆసరా పథకం వార్తలు

ఈనెల 11న సీఎం జగన్ చేతుల మీదుగా వైఎస్సాఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన మంత్రి... అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకం అందాలని ఆదేశించారు.

minister botsa satyanarayana
minister botsa satyanarayana

By

Published : Sep 9, 2020, 9:19 PM IST

డ్వాక్రా సంఘాల మహిళలకు తోడ్పాటు అందించేందుకు ఈనెల 11న సీఎం జగన్ చేతుల మీదుగా వైఎస్సాఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అర్హులైన అందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

పురపాలక సంస్థల కమిషనర్లు, మెప్మా, ఇంజినీరింగ్ తదితర విభాగాల అధికారులతో విజయవాడ నుంచి మంత్రి బొత్స వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి చేస్తున్న అన్ని కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ, ప్రజాప్రతినిధులందరితో సమన్వయం చేసుకుంటూ ఈనెల 11 నుంచి 17 వరకు ఆసరా వారోత్సవాలను నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని సుమారు 1.52 లక్షల స్వయం సహాయక సంఘాలకు మొదటి విడతలో సుమారు రూ.1186 కోట్లు.. ఆసరా ద్వారా లబ్ధి చేకూరనుందన్నారు.

ఈ విధంగా అందజేస్తున్న మొత్తాన్ని.... బ్యాంకులు పాత బకాయిలుగా జమ చేసుకోకుండా చర్యలు తీసుకున్నామన్నారు. త్వరలో ప్రారంభం కానున్న జగన్న తోడు పథకం పై కూడా మంత్రి బొత్స సమీక్షించారు. టిడ్కో ఆధ్వర్యంలోని గృహాల లబ్ధిదారుల జాబితాలను మరోసారి సరిచూసుకోవాలని అధికారుకు సూచించారు.

ఇదీ చదవండి:

అంతర్వేదిలో రథం దగ్ధం..ఎగసిపడుతున్న ఆగ్రహ జ్వాలలు

ABOUT THE AUTHOR

...view details