ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విశాఖ రాజధాని వద్దనేవారు.. ఉత్తరాంధ్రకు శత్రువులు: మంత్రి బొత్స - అమరావతి రైతులు పాదయాత్ర

MINISTER BOTSA SATYA NARAYANA : విశాఖ పరిపాలన రాజధానిగా వద్దన్న వారు చరిత్ర హీనులవుతారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జనసేన పార్టీకి ఒక విధానం, ఉండాల్సిన సిద్ధాంతాలు లేవని విమర్శించారు. త్వరలో పరిపాలన రాజధానిగా విశాఖలో సీఎం విధులు నిర్వహిస్తారని స్పష్టం చేశారు.

MINISTER BOTSA SATYA NARAYANA
MINISTER BOTSA SATYA NARAYANA

By

Published : Oct 16, 2022, 5:42 PM IST

MINISTER BOTSA : మూడు రాజధానులపై జగన్ నిర్ణయానికి ప్రజల మద్దతు ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పరిపాలనా రాజధానిగా విశాఖ తప్పక వస్తుందని తేల్చిచెప్పారు. రాజధాని కావాలా? వద్దా? అని ఇంటింటికీ వెళ్లి అడగండని సూచించారు. జనసేన రాజకీయ పార్టీ కాదు.. దానికి ఒక సిద్ధాంతం లేదని విమర్శించారు. విశాఖను పవన్‌ ఎందుకు వద్దంటున్నారు.. ఇక్కడే పోటీ చేశారు కదా అని ప్రశ్నించారు. భూములు, ఆస్తుల విలువ పెంపు కోసమే అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారని వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు 3 రాజధానుల బిల్లు ప్రవేశపెడతామని పేర్కొన్నారు. విశాఖ రాజధాని వద్దనేవారు ఉత్తరాంధ్రకు శత్రువులు అన్నారు.

విశాఖ రాజధాని వద్దనేవారు ఉత్తరాంధ్రకు శత్రువులు

విశాఖ పరిపాలన రాజధానిగా వద్దన్న ప్రతి ఒక్కరూ చరిత్ర హీనులుగా మిగిలిపోతారని బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ పరిపాలన రాజధాని కోసం స్వచ్ఛందంగా నిన్న విశాఖ గర్జనలో ప్రజలు పాల్గొన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొంతమంది క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు. జనసేన పార్టీకి ఒక విధి విధానము లేదని.. రాజకీయ పార్టీకి ఉండాల్సిన సిద్ధాంతాలు లేవన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details