సుప్రీంకోర్టు తీర్పును శిరసా వహిస్తామని మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో నూటికి నూరుశాతం విజయం వైకాపాదేనన్నారు. ప్రజల ప్రాణాలకు ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశ్యంతో ఎన్నికలను వాయిదా వేయాలని కోరామని మంత్రి బొత్స చెప్పారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఎన్నికలంటే తమకు భయం లేదని.. ఎవరో వచ్చి విజయాన్ని అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. ఎవరేం చేసినా అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలని అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో ఏకగ్రీవాలు అనేవి ఎప్పట్నుంచో వస్తున్నాయని చెప్పారు.
ఏం చేసుకున్నా మేం పట్టించుకోం: మంత్రి పెద్దిరెడ్డి