ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

"పన్నులు కట్టకపోతే.. స్థానిక సంస్థలు ఎలా బలోపేతం అవుతాయి?"

Botsa Satyanarayana on tax: పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు ఎలా బలోపేతం అవుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. స్థానిక సంస్థలు నిర్వహించాలంటే... పన్నులు సక్రమంగా చెల్లించాలని అన్నారు. కరెంట్ బిల్లులు కట్టకపోతే విద్యుత్ కనెక్షన్ తీసేస్తున్నారని తెలిపిన ఆయన.. ప్రజలెవరినీ బలవంతం చేయడం లేదని స్పష్టం చేశారు.

Botsa Satyanarayana on tax
పన్నుల వసూలుపై మంత్రి బొత్స

By

Published : Mar 21, 2022, 1:20 PM IST

Updated : Mar 21, 2022, 8:03 PM IST

పన్నుల వసూలుపై మంత్రి బొత్స

ఆస్తి పన్ను వసూలు కోసం ఓ మున్సిపల్ కార్పొరేషన్​ బ్యానర్ ఏర్పాటు చేస్తే తప్పేముందని...కఠినంగా వ్యవహరిస్తే అది తప్పవుతుందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు ఎలా బలోపేతం అవుతాయని ఆయన ప్రశ్నించారు. కరెంట్ బిల్లులు కట్టక పోతే విద్యుత్ కనెక్షన్ తీసేస్తున్నారన్న ఆయన.. ప్రజలెవరినీ బలవంతం చేయడం లేదని అన్నారు. బలవంతపు వసూళ్ల తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టంచేశారు. జరిగిన ఘటనపై విచారణ చేయిస్తున్నామన్నారు.

పన్నులు కట్టకపోతే ఆస్తుల జప్తు అన్నది ఎప్పటినుంచో ఉంది ఇవాళ కొత్తగా వచ్చిన నిబంధన కాదని తెలిపారు. ప్రజలని ఇబ్బంది పెట్టి జప్తు చేయడం ప్రభుత్వం‌ ఉద్దేశం‌కాదని స్పష్టంచేశారు. స్థానిక సంస్థలు నిర్వహించాలంటే పన్నులు సక్రమంగా చెల్లించాలని బొత్ససత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు.


ఇదీ చదవండి:కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం కాకపోవడానికి.. కారణం ఇదే: డీఎల్

Last Updated : Mar 21, 2022, 8:03 PM IST

ABOUT THE AUTHOR

...view details