ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వాన్ని నమ్మండి.. ప్రతిపక్షాన్ని కాదు: బొత్స - అమరావతిపై బొత్స కామెంట్స్

అమరావతి అభివృద్ధి ప్రభుత్వ బాధ్యతని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అమరావతిలో పెండింగ్ పనులను తక్షణం ప్రారంభించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఒక ప్రణాళిక బద్ధంగా అమరావతిపై ముందుకెళ్తామన్నారు.

బొత్స సత్యనారాయణ
బొత్స సత్యనారాయణ

By

Published : Aug 13, 2020, 6:02 PM IST

అమరావతి ప్రాంతాన్ని శాసన రాజధానిగా అభివృద్ధి చేయాలని గతంలోనే నిర్ణయించామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారని ఆయన అన్నారు. అమరావతిలో పెండింగ్ పనులపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారని బొత్స తెలిపారు. తక్షణం పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారన్నారు. అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తి చేస్తామని.. వాటి వినియోగానికి తమ వద్ద ప్రణాళిక ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకునే ముందుకు వెళ్తున్నామని మంత్రి వెల్లడించారు.

వికేంద్రీకరణ చట్టం ఆమోదం పొందగానే విశాఖలో శంకుస్థాపన చేయాలని భావించామని బొత్స తెలిపారు. కానీ తెదేపా కోర్టులో పిటిషన్లు వేసి అడ్డుపడిందని ఆరోపించారు. శంకుస్థాపన కార్యక్రమం మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఆగదన్నారు. సంప్రదాయంలో భాగంగానే శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించామన్నారు. అమరావతి ప్రాంత అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమని.. ఈ అంశాన్ని రైతులు, రియాల్టర్లు గమనించాలని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత ప్రభుత్వానిదేనని బొత్స స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధికి ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.

"అమరావతి.. రాష్ట్రంలో అంతర్భాగమే. భూమిలిచ్చిన రైతులకు, భూములు కొన్నవారికి అందరికీ చెబుతున్నా.... ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తాం. మాది పూర్తి బాధ్యత. లేనిపోని అపోహాలకు పోవద్దు. అధికారం కోల్పోయిన వారి మాటలు నమ్మొద్దు. ప్రభుత్వాన్ని నమ్మండి. అవరోధాలు తొలగించుకుని ముందుకెళ్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధే వైకాపా లక్ష్యం."

--బొత్స సత్యనారాయణ, పురపాలకశాఖ మంత్రి

--

ఇదీ చదవండి:

దిశ చట్టం అమలుపై సీఎం జగన్‌ సమీక్ష

ABOUT THE AUTHOR

...view details