రాష్ట్రంలో ఉనికి కాపాడుకోవటానికే భాజపా తాపత్రయమని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. మూడేళ్ల తర్వాత భాజపాకు ఇప్పుడు జగన్ పరిపాలన బాగాలేదని గుర్తొచ్చిందా అని ఆయన ప్రశ్నించారు. ఏదైనా ఒక సమస్యపై ప్రత్యకంగా సూచన చేస్తే స్వీకరిస్తాం తప్ప.. ఇష్టానుసారం మాట్లాడితే ఎలా అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో నీతి అయోగ్ నివేదిక చూస్తే సరిపోతుందన్నారు. భాజపా పాలన ఉన్న రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయో చూసుకోవాలంటూ చురకలంటించారు.
MINISTER BOTHSA: 'రాష్ట్రంలో ఉనికి కోసమే భాజపా సభ' - POLITICAL
రాష్ట్రంలో అభివృద్ధిపై నీతి ఆయోగ్ వచ్చి ర్యాంకు ఇచ్చిందని.. దీనికి భాజపానే సమాధానం చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తమ ఉనికి కాపాడుకోవడానికే భాజపా రాష్ట్రంలో సభ నిర్వహిస్తోందని విమర్శించారు.
'మేమున్నామని చెప్పేందుకు భాజపా సభ పెడ్తోంది..'