ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగ్గయ్యపేటలో కృష్ణా జలాల ప్రాజెక్టు ప్రారంభం

కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేటలో కృష్ణా జలాల ప్రాజెక్టును మంత్రి బొత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి బొత్స... పేదల అభ్యున్నతే లక్ష్యంగా వైకాపా ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. సంక్షేమ పథకాలపై తెదేపా అధినేత చంద్రబాబు అనవసరమైన విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

minister bosta
minister bosta

By

Published : Dec 12, 2020, 3:33 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో కృష్ణా జలాల ప్రాజెక్ట్​ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. పద్మావతి నగర్​లో గల హెడ్ వాటర్ వర్క్స్ వద్ద రూ. 18.90 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. అనంతరం నెహ్రు చౌక్ వద్ద ఏఐఐబీ ద్వారా రూ.33.99 కోట్ల నిధులతో మంచినీటి సరఫరా అభివృద్ధి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి బొత్స.... పేదల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు.

ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే...ప్రతిపక్ష తెదేపా అనవసరపు ఆరోపణలను చేస్తుందని విమర్శించారు. చంద్రబాబు మతి కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. ఏలూరు ఘటనలో ప్రభుత్వం వేగంగా స్పందించిందని... అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details