'రాజ్యాంగానికి, చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో ఎన్నికలు జరుపుకుంటున్నాం. ఈ క్రమంలో చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలు ఎక్కువగా వచ్చాయి. వీటిపై పరిశీలనకు ఎన్నికల కమిషనర్ ఆదేశించటం.. తొందరపాటు చర్యగా' బొత్స అభిప్రాయపడ్డారు. విజయనగరంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుతో కలసి... ఎన్నికల సంఘం నిర్ణయంపై మీడియా సమావేశం నిర్వహించారు. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 13 జిల్లాలో 1,980 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇది 15.54 శాతం. చిత్తూరు, గుంటూరు జిల్లాలో చూసుకుంటే 2013లో 16.21 శాతం మాత్రమే ఏకగ్రీవాలయ్యాయి.
చిత్తూరులో ప్రస్తుతం 449పంచాయతీలో 24.50 శాతం మేర... 110 ఏకగ్రీవాలు జరిగాయి. గుంటూరులోని 337 పంచాయతీలో 19.88 శాతం లెక్కన 67 ఏకగ్రీవాలయ్యాయి. గత ఎన్నికలకు., ఇప్పటికీ వ్యత్యాసం చాలా తక్కువగా ఉందని మంత్రి పేర్కొన్నారు. కమిషనర్., ఈ విషయాలను, పూర్వపరాలను ఏ మాత్రం పరిశీలించినట్లు లేదన్నారు. ఏదైన లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉంటే చర్యలు తీసుకోవాలి గాని.. వ్యక్తిగత అభిప్రాయంగా కమిషనర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందని మంత్రి అన్నారు.