ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 29, 2019, 5:46 PM IST

ETV Bharat / city

'చంద్రబాబును అడ్డుకున్నది మోసపోయిన రైతులే'

టిడ్కో ద్వారా చేసిన రివర్స్ టెండరింగ్​లో రూ.105 కోట్లు ఆదా అయ్యాయని... మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మరికొన్ని యూనిట్లకు త్వరలోనే రివర్స్ టెండరింగ్ చేపడతామని స్పష్టం చేశారు. అమరావతి పర్యటనలో చంద్రబాబును అడ్డుకున్నది మోసపోయిన రైతులే అని వ్యాఖ్యానించారు.

minister-bosta-comments-on-chandrababu-tour-in-amaravthi
minister-bosta-comments-on-chandrababu-tour-in-amaravthi

టిడ్కో ద్వారా చేసిన రివర్స్ టెండరింగ్‌లో రూ.105 కోట్లు ఆదా అయ్యాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 14,368 ఇళ్లకు రూ.707 కోట్ల విలువతో టెండర్లు పిలిస్తే... రూ.601 కోట్లకు ఎల్-1కు ఇచ్చామని... పాత రేట్లతో పిలిచివుంటే ఒక్కొక్కరికి రూ.95 వేల వరకు భారం పడేదని వివరించారు. రివర్స్ టెండరింగ్‌తో ఆ మేరకు లబ్ధిదారులకు ప్రయోజనం కలిగినట్లేనని స్పష్టం చేశారు.

రివర్స్ టెండరింగ్‌లో రూ.105 కోట్లు ఆదా

ప్రతి చదరపు అడుగు నిర్మాణానికి రూ.250 మేర ప్రజాధనం ఆదా అయిందని వెల్లడించారు. డిసెంబరు 13, 19, 26 తేదీల్లో రివర్స్ టెండరింగ్‌లు ఉన్నాయని... మొత్తం 65,968 ఇళ్లకు రూ.3,258 కోట్లతో టెండర్లు పిలుస్తామని తెలిపారు. దోపిడీని ఆరికట్టడమే రివర్స్ టెండరింగ్ లక్ష్యమని ఉద్ఘాటించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బొత్స... తెదేపా అధినేత చంద్రబాబు అమరావతి పర్యటనపై విమర్శలు గుప్పించారు. రాజధానిలో మోసపోయిన రైతులే చంద్రబాబును అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు. రాజధానాని మొత్తం కట్టేసినట్లు చంద్రబాబు చెబుతున్నారని... ప్రజలను ఇంకా మోసం చేసేందుకే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

రాజధానిలో 4 భవనాలే 55 నుంచి 90 శాతం పూర్తయ్యాయని స్పష్టం చేశారు. ఈ 4 భవనాలు తప్ప రాజధాని ప్రాంతంలో ఏమున్నాయని ప్రశ్నించారు. మౌలిక వసతులకు రూ.9,060 కోట్లు ఖర్చు చేశామని చెప్పడం అబద్ధమన్నారు. డిజైన్లు, కన్సల్టెంట్లు, రోడ్లు, భవనాలకు రూ.5,674 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు.

చంద్రబాబును అడ్డుకున్నది మోసపోయిన రైతులే: మంత్రి బొత్స

సింగపూర్ కంపెనీలతో ఒప్పందం లేదు..!
ఏపీ ప్రభుత్వం, సింగపూర్ మధ్య ఒప్పందం ఏమీలేదని మంత్రి బొత్స పేర్కొన్నారు. ఒప్పందాలన్నీ సింగపూర్ ప్రభుత్వంతో కాదని... ఆ దేశంలో ఉన్న కంపెనీలతోనే అని తెలిపారు. సీఆర్డీఏ-సింగపూర్ కంపెనీల మధ్య మాత్రమే ఒప్పందం కుదిరిందన్నారు. బీఆర్ శెట్టి సంస్థ చంద్రబాబు హయాంలోనే వెళ్లిపోయిందని వివరణ ఇచ్చారు.

ఇదీ చదవండి: తేనెటీగల దాడిలో.. మంత్రి అనిల్​కు గాయాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details