గత 5 రోజులుగా చిన్నపాటి జ్వరంతో మంత్రి బాలినేని బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ లోని తన స్వగృహంలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. జ్వరం వస్తూ పోతూ ఉంది. ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ తలెత్తలేదు. మంగళవారం మరోసారి మంత్రికి కొవిడ్ పరీక్ష నిర్వహించారు పాజిటివ్ వచ్చింది. వైద్యులు సలహా మేరకు అపోలో హాస్పిటల్ లో చేరారు. ఆరోగ్యంగా ఉన్నారని చికిత్స చేస్తున్న వైద్యులు తెలిపారు.
మంత్రి బాలినేనికి కరోనా.. క్షేమంగానే ఉన్నానంటూ సందేశం - మంత్రి బాలినేనికి కరోనా
తనకు కరోనా సోకిందని మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని ప్రకటించారు. త్వరలోనే ఇంటికి చేరుకుంటానని అన్నారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలకు, తన అభిమానులకు సందేశం పంపారు.
minister balineni srinivas
"నాకు కరోనా సోకింది. హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. త్వరలోనే ఇంటికి చేరుకుంటాను."- మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ఇదీ చదవండి:'హిందూ సంప్రదాయానికి ఆధునిక చిహ్నం రామాలయం'