మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. కేసుల మాఫీ కోసమే గంటా వైకాపా వైపు మొగ్గు చూపుతున్నారని మండిపడ్డారు. అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడ గంటా శ్రీనివాసరావు ఉంటారని.. పదవి లేకపోతే ఆయన ఉండలేరని ఎద్దేవా చేశారు. సైకిళ్లు, భూ కుంభకోణాల్లో గంటా అనుచరులే ఉన్నారని మంత్రి అవంతి ఆరోపించారు. గంటా శ్రీనివాసరావు కుంభకోణాలను విజయసాయిరెడ్డికి చెప్పానని.. గతంలో గంటాపై మంత్రివర్గ సహచరుడే ఫిర్యాదు చేశాడని అవంతి ఆక్షేపించారు.
అధికారం ఎక్కడ ఉంటే అక్కడే గంటా : అవంతి - మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి విమర్శలు
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గంటా దొడ్డిదారిన వైకాపాలోకి చేరేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అధికారం లేకపోతే గంటా ఉండలేరన్న మంత్రి.. కేసుల నుంచి తప్పించుకునేందుకే అధికార పార్టీలోకి చేరుతున్నారని విమర్శించారు.
అధికారం ఎక్కడ ఉంటే గంటా శ్రీనివాసరావు అక్కడ ఉంటారు: అవంతి
Last Updated : Aug 5, 2020, 11:44 AM IST